భారతసేనల్లుపన్నినా వేళా..  పరమాత్మ నుజూసియు పార్థుఁడుపలికే  సేన మధ్యామందు శ్వేతవాహనుడు.. ఖిన్నుడై నిలిచెనే కిరీటి తాను గాండీవంపూను కొని కవ్వాడితాను సేనల్ల లోనున్నసెలవుండుపలికే  విల్లును చేకొనివిజయుండుతాను  శ్రీ కృష్ణునిజూసిఇట్లానిపలికే .. తనరెండుచేతులాహస్తములుపట్టి   చెయిసన్న చేయుచుచేసేవిన్నపము ..   కేశవా   క్రిష్ణమ్మ వాసు దేవుడా  వామనుడ   వైకుంఠమేలినాస్వామీ  అసురులగెలిచినాజనార్దనుడ ..పసుల గొమ్పోయినా పద్మ నాభుడా సృష్టిఅంతయేలు శ్రీ రామచంద్ర  మందావులను యేలుమాధవాస్వామీ గోకులామేలినాగోవర్ధనుడా ..వెన్నుడా  నాదొక విన్నపముదేవా –  వేడెద నా మాటవెలి బుచ్చ వేమి పుత్రుల్లు  పౌత్రులు  భ్రాతల్లు  ప్రజలు   కడు మంచి చెలి కాండ్రు, కర్ణ భీష్ములు  ద్రోణులుభీష్ములు ద్రోణతనయుడు   నిముషక్షణమాత్రాననిలచినాచాలు తొమ్మిదివేల సంఖ్య వారు తుంగక్షత్రియులు.. పది వేల సంఖ్య వారుపట్టభద్రులు  అరవై వేల సంఖ్య వారు ఐనజామ్బవులు వేవేలసంఖ్య వారువృద్ధరాజులు పన్నంగ పదకొండుఅక్షౌహిణులు .. అతి రథులు  మహా రథులు   దుర్యోదనులు  అర్థ రతులాగెల్వ నావల్లదేవా ?.. గురువులవధియించ గోవింద  వెరతు    కప్పెరదయ చేయుమీ .. గంగ కూ వోను ..  ఇందరుఒర్వంగాఈయుద్ధరంగం .. వల్లపోమ్మనియెను  ఉత్తముడు  దేవ  బంధువుల నేల్లాను   భంగంబుజేసి  రాజ్యంబునే నొల్లభావాను రాజ  వక్రము శాయకుమీ   వనములకుబోను తపసునాకీవయ్య  బావ శ్రీ క్రిష్ణ అని యిట్లుఅర్జునుడుపల్కంగవినుచు   కల కలానవ్విరికమల నాభులు  తాంబూలంవేయుచుఒప్పు గాదేర ..కప్పురంపుపలుకులేత్రుల్లంగానవుచు  రథం మీద కూర్చుంది రమ్ము  రమ్మనుచు  చేయి జాపి పిలుచుచు చిరునవ్వు నవుచు  మకర కుండలాలు   మరి వీను లమర .. కిరీటిమొహంజూసికృష్ణుండు పలికే  ఎట్లంటి  వర్జునా?ఏమంటివిపుడు .. వారంత నీ చేతచచ్చేటివారా ద్రోణులుభీష్ములుద్రోణతనయులు ..వారయ్య – నీ జేతచచ్చేటివారు కర్ణులు శేల్యులు కృపా చార్యులు .. వారంత నీ చేతచచ్చేటివారా అశ్వద్దామాదులు దుర్యోదనులు ..వారయ్య – నీ జేతచచ్చేటివారు వారలునీ యంత వీరులు గారా ..చంపేదినీవును..చచ్చేటివారా .. ఉభయులునేనేసుమీ .. వినుమిఅర్జునుడా  వారికినిచావులులేవుసుమీఅయ్యా  నీ తోటిస్నేహాన  మొహానబట్టి ..  అర్జునుడు భారతం   ఒక్కడేపో డు  అనేకధర్మాలు నీకు నే వేడా   అదియును గాక  మరి వినవెఅర్జునుడా   రాచ ధర్మమునీతిఎరుగవెన్నాడు  రాచధర్మమునీతి తెలిపెదా వినుమీ తపసునాకిమ్మనా  ధర్మమానీకు ? అన్యుడనా ? నీకుఅర్జునుడనేను ? అధర్మము చేయుమనిపలుకసుమీ   అయ్యా సేన మధ్యా మందు శత్రులాగెలిచి ....జయిస్తేజయ లక్ష్మిచేకొనవే చాలా   భారతంవోడంగ పార్థివా వినుమా వీర లక్ష్మినిగెలిచివిజయుడవుగమ్ము    అర్జున   అమరేంద్ర  భీభత్సవిజయ ..  ఫాల్గు ణా .. పార్థివా.. శ్వేతవాహనుడా తెలిపెదవినవెనా దేవాది మహిమా.. వృక్షాల లోకెల్ల వీశేషమైనా .. అశ్వత్థ వృక్షమ్మునేనేకిరీటి చెట్లలోకెల్లా శ్రేష్ఠ మైఉన్నా   శ్రీకల్ప తరు వనగ నేనేకిరీటి తరువుల లోకెల్లా విశేష మైన ..  శ్రీగంధపుతరు వనంగానేనేకిరీటి  మెట్లల్లలో కెల్లామేటిమై ఉన్నా ..మేరుపర్వతమనగనేనేకిరీటి దినాలలోకెల్లవిశేషమైనా ....ఏకాదశిఅనియేటిహరి దినమునేను  వారాల లోకెల్లవిశేష మైనా ...... భాను వారమనంగ నేను కిరీటీ పక్షాల లోకెల్లా విశేష మైన  శుక్లపక్షమ్మనగనేనేకిరీటి  మాసాల లోకెల్లవీశేషమైనా   మార్గ శిరమాసమ్మునేనేకిరీటి మొగ్గల లోకెల్ల విశేష మైనా .. సంపెంగమొగ్గనంగనేనేకిరీటి పువ్వులలో కెల్లావిశేష మైన  మల్లె పువ్వనంగ.. నేనేకిరీటి   పుష్పాలలోకెల్లవిశేష మైనా .. విరజాజిపుష్పము నేను కిరీటి  కమలాల లోకెల్లావీశేష మైనా – దామెర కమలముఅనంగనేనేకిరీటి   పద్మాలలో కెల్లవీశేష మైనా ..  అష్టదళపద్మమ్మునేనేకిరీటి వనాల లోకెల్ల వీశేషమైనా .. శ్రీతులసివన మనంగ నేనేకిరీటి  పక్షుల లోకెల్లా ప్రభువై నట్టి..  గరుడపక్షనంగ నేను కిరీటీ  అశ్వాల లోకెల్లవిశేషమైనా .. ఉచ్చై శ్రవమనియేటి గుర్రంబునేను  గజములలోకెల్లావిశేషమైనా.. ఐరావతమని యేటిఏనుగనునేను నాగ లోకామందు వాసుకినినేను .. దేవ లోక మందుఇంద్రుణ్ణి నేను కామ ధేనువు నేనుకవ్వాడి వినుమా.. ..ఇంద్రుడు చపట్టినావజ్రమునునేను  దానవుల లోకెల్ల ధన్యుడై నట్టి .. ప్రహ్లాదుడనంగ నేనే కిరీటీ   బృహస్పతినేనే సుమీ పృథ్వీ అర్జునుడా .. వ్యాస మహా ముని భీ భత్స  నేను ఆదిత్యుడ నేను  ఆర్జునుడనేను .. అంబ రీశుడ ని చెప్పు అవనిపతినేను   ద్రువుడనిచెప్పంగపృథ్విఅంత నేను .. చెర్లల్లోపారేటిసింహమునునెను .. సృష్టి పై జామ్బవా .. నేరేడునేను   కోరగాఅమృతాన పుట్టినా యట్టి .. పారిజాతంనేను ..పార్థుడా వినుము  బ్రహ్మమ్మునేనే సుమీ..భగవంత నేను  .. ఇంద్రుండనేనే సుమీ  ఈశ్వరుడనేను  చంద్రుడనేనేసుమీ శంకరుడనేను .. ఇంద్రాదిదేవతలు.. యిందరూ నేను నక్షత్రాలలోకేల్ల విశేష మైనా .. పునర్వసునక్షత్రా న   భ్రుగు మహా ఋషిని .. అనంతమవతార మనంతమహిమా .. దశావతారాలయశోదవాడా   అష్టదిక్పాలకులు  అష్టమాసిద్ధీ.. సప్త దాతలు   నేను  సర్వజ్ఞ   వినుమీ    గంగయమునలసరస్వతిసంగ మందూ ..వేణుమాధవుడను వినవె అర్జునుడా..  పంచతీర్థమ్ములు  పంచాయనదులు .. వ్యాస వాసుర నేను .. వినవె అర్జనుడా  మౌనిగలతీర్థాలు   మరి ఎన్నో కొలనులు..జలాదిసేనుడనేను వినుమీ  అర్జనుడా  విశాల నేత్రుడను  విశ్వేశ్వ రుడను ..  వారణాసందు సుదేవుడను  దండిగాసిరులు  సిరి చందనములు ..హరి ద్వారం   బదరి కాశ్రమమునేను రుగ్వేదమ్ములకురుద్రుడను నేను  యజుర్వేదమ్ము లకుయజమానినేను  సామ వేదమ్ములకుసర్వమునునేను .. అధర్వణవేదములు అంతానునేను  యజ్ఞంత వృత్తుడను  యజ్న గుహ్యుడను .. యజ్న సాధులుగొన్న యజ్నుండ నేను  యజ్ణ ఫల దాయక ప్రజ్ఞా ఫలదున్ని ..యజ్ణ పతి ఫలదున్ని  యజ్ణ తంత్రున్ని  యజ్ఞా వంతులుగొన్నయజ మానినేను  ధర్మయజ్ఞము బ్రహ్మ పాండు యజ్ఞములకు   పూర్ణహారతులుగొన్నపురుషోత్తముడ  గధా సురుని జంపిన గధా ధరుడనేను   ఫలు తీర్థములు నేను .. ఫార్థివా వినుమీ మధుమధుతీర్థ ములు  మధుసంగ మందూ ..  జిహ్వలుగల యట్టి తిల తర్పణాలు  శ్రీ రామ గజనేను సీత గుండమును.. విష్ణు పత్.. రుద్ర పత్  బ్రహ్మపదవులకు  పిత్రు పత్   మాతృపత్   పితామహునికి   పిత్ర్టురూపా మందు ..  జనార్ధనుడా  పద్దెనిమిదిపాదాల పాయసాన్నంబు .. అన్నదానాలు గొన్నఅచ్యుతుడనెను  స్వర్గాది  మోక్షాదిసకలజనులకును .. మోక్ష ప్రదాయక ముక్తికి  నేను వనములునేనేసుమీ .. వన స్పతులునేను  జలములు నేనేసుమీ .. స్థలములు నేను  క్రతువులునేనేసుమీ   కుసుమాకరుడా ..అక్షయ పాట కుడ నేను   అంతానునేను  వట కిందకుడిచినవామ నుడనేను పిండ దానాలుగొన్న  పృథ్వీ శ్వరుడ వేదశాస్త్రమ్ములవేదికల యందు ..  వేదాంతవేద్యుడనేను  వినవెకిరీటి సంగీత లోలుల  సాధులాయందు ..సకలవిద్యలయందుకుశలుడనునేను దుర్యోధనుడుమొదలైనధృతరాష్ట్రునిపుత్రుల..  దుర్యోధనునిబలముదుల్లుగాగొట్టి   పక్ష పాత మాడి పాండవులగెలిచి .. నిమిత్తమాత్రాననిన్నునిలిపితిని.. నిముషమునజంపెదను   నీవుజూడంగా .. దశరథునిపుత్రుడా .. శ్రీరామచంద్ర  ..వాలినిజంపినాశ్రీ వారి జోదరుడా  అంజలీ కృతస్వామీ అయోధ్య రామా ..  సుగ్రీవుచుట్టమ్ము   శుక్ల రక్షకుడా  వెలయద్రౌపదివరద   బిరుదు నీవరదా   అజామీళుని వరద  ఆక్రూర వరదా సేతు బంధించిన  సీతవల్లాభా ..  లంకసాధించినరామచంద్రుడా  రావణునిజంపినా   రఘు నాథ  వినుమి ....రఘు వేశ్వరుడ నేనురఘు నాథవినుమి  హిమవంత పర్వత   నీమహిమ లందు ......స్వర్గ ద్వారమ్మిదే  ద్వారకాపురము  దైత్యసంహారుడా దానవాంతకుడాలక్ష్మికిపతి ఐననారాయణుడా.. అన్ని యును చెప్పితిని అర్జునా  నీకు  .. అఖిలాండ   బ్రహ్మాండమంతానునేను  సూది గూర్చే పుర మంతాను నేనుచూపెను..చూడవే ..చోద్యంపుమాయ  త్రై లోక్యనాభులు   తన తెలివినిచ్చి .... విష్ణువును ..విశ్వ రూప మంతాను చూపే  శంఖమ్ముఒక చేత.. చక్ర మొకచేత...... సారంగ   గద  పద్మ  మొక చేతబట్టి  కమలములుబట్టిరి  కమల నాభులు.... తామెరిగిబ్రహ్మాండభాన్డవముముట్టే  పాతాళలోకమునుపాదములు ముట్టె..  పాద నఖమునబ్రహ్మాండములుఅణగే పాదనఖమునబుట్టె .. బోగావతీయు .. మెరుపుమీకాళ్ళనే మేధినీ బుట్టె రోమరోమానబ్రహ్మాండము పుట్టే .. బ్రహ్మ పుట్టంగా  బ్రహ్మాండముబుట్టె మడిమలబుట్టె  మహా రుషిగణాదులు.. రుద్రుడు బుట్టెను రూడీతోవెలుగా గుహ్యమునమంత్రమున  ఘోషించ గానే .. నక్షత్ర పథములు  నఖములువెడలె  పాదముల క్రింద  బ్రహ్మాండములుఅణ గే ..పాద నఖమునబుట్టెభాగీరధీయు  సుజనులువైశ్యులు   శూద్రులుమోకాళ్ళు .. కడుమంచి బాహువులు క్షత్రియులుఅయిరి  చెలువంపు దేవతలుసిరి తొడలుఆయే ....చుక్కలునక్షత్రాలాయే   శోభిల్లేతొడలు   శంకరుడు తన మంచిమొగమాయే చూడ   సూర్యుండుముఖమాయే  సోముడునాభి  .. అష్టదిక్పాలకులుఅవి రెండువీనులు  సప్త నదులన్నీ దాక్షో హిను లాయే .... సారంపుసరస్వతి జిహ్వతానాయె  తమిరిగణ మంతాను  తామైరిదేవతలు .... మత్తగజములన్ని మకు టమ్ము లాయే  నాభి కమలామందు  నయన శాంభవులు ..శ్రీ లక్ష్మితోమీరుశ్వేతమైఒప్ప  ఇమ్మునా ఈశ్వరుడు  ఇందునాబ్రహ్మ యై ..వాయు వేగమ్మునా  వైతేరగనిరి భూలోక భువర్లోక   సువర్లోకమ్ము ..వెలిసినశ్రీవిష్ణు లోకముల గనిరి   సప్త సాగరములే సప్త ద్వీపములు   స్వర్గమ్ము మోక్షమ్ముసరి యందుగనిరి   పంచమినాయకీ భగవతీదుర్గ వాల ఖిల్యుల గనిరి వటము పైనుండి  సనకసనందనులతాగనే.. కిరీటి  జలాది గనెను మరి   సరిగంగగనిరి .... అమరులు దేవతల  అర్జునుడుగనెను  ప్రయాగమాధవులపార్థుఁడు  గనెను ..శ్రీవిశ్వ నాథుల చేలువొందు  గనిరి  సహస్రకమలాలు  ఉదయించినజలధి .. స్వర్గమ్ముమోక్షమ్ముసరియందుగనిరి   ఇల మీద కొండలు  హిమగిరులుమెట్లు ..ఇంద్రునినందన వనమందు   గనిరి  నందన్నవనములో నరు మరుపటిండ్లు.. విచిత్రపుగూళ్ళ గనిరి ..విమానములగనిరి  నంది వాహనుని గణపతినిగనిరి ..  కడనున్నమహర్షులకవ్వాడిగనెను ..  అచ్యుతుల  అనంతుల  ఆత్మలోగనిరి  అసురులు పెరుగుతరువంగా అమృతమ్ముగనెను   చిరుతల నాడు..చిన్నవాణ్నిగనిరి ....  కూర్చుండిచన్నీయ యశోదగనిరి .. యశోదదేవకీయాదవులగనిరి .. పురిట్లోను   భూతకిని చంపినాతావుగనిరి  పున్డరీకాక్షులగనిరి  పురుషోత్తములు పాలు పెరుగులువెన్న నెయ్యి మీగడలు .. ఆరగించంగానేఅచ్యుతుల గనిరి ..  దామేర్లుతల చుట్టిదామోదరులు   మధ్దులగూల్చినమాధవుని గనిరి  అన్న బల భద్రునితోఆట లాడగను .. అటుకులకుచేయి చాపినాహస్తములుగనిరి  అల్లంపు పడి గలే ..అతి రసాన్నములు.. ఎల్ల నావులబొల్లి లాగేల్లగనిరి .. దామేర్లుతల చుట్టిదామోదరుడు .. సుద్దులుకుడిచినతావుగనిరి బకాసురుని జంపినా  బలు వాహనుడా ..  ఎదురు వాక్యమ్ములకుమృదు భాష లాను  .. వేణునాదంబట్టేవెయ్యివిధాల ..  వెన్నుడువేణునాదంబట్ట గానే .. వెలదులువచ్చేరు  శ్రీకృష్ణునిజూడ నారాయణుడు వేణు నాదంబట్టగానే  నాథ్తులువచ్చేరు నారాయణునిజూడ    పరమాత్ముడువేణు నాదంపట్టగానే..పణతులు వచ్చేరుపరమాత్మునిజూడ  కృష్ణుడువేణు నాదం బట్ట గానే  చెలియలు వచ్చేరు   శ్రీ కృష్ణునిజూడ ..  వృక్షాలు  పక్షులే   మృగ జాతులేల్ల .. మెడలేత్తుకొని వాటిమేతల్లుమరచి    హా కృష్ణా  హా కృష్ణా  హా కృష్ణాయనుచు...... హాయనీ తలచేటిఅతివెల్లగనిరి  కమల నాభునిచరణకుంకుమలుగనిరి .. గోపికలుకొనియాడినతావు గనిరి  పద్మ నాభుని పాద పద్మములు గనిరి పణ తులు పవళించినతావుగనిరి   పోన్నలే  పొగడలే   పుష్ప జాతులను .. పోదలేల్లవెదకేటిపొలతుల్ల గనిరి .. నమ్మితినినుదేవ నళిననాభుడా .. దయ జూసి కావవేదామోదరుడా ..  సుతుల పతులనువిడచి పద్మ నాభుడా ..  ప్రియముజేర వచ్చితిని   పృథ్వీశ మేము  రాచ క్రీడలనుతాము  రమణులనుతాము .. అనంత మహిమల ఆడంగ గనిరి ..  కాళింగమడుగులకు  గంతులుగొన్నట్టి ....పడిగలకుపాదాలు  ఒత్తినవిగనిరి  నాగ లోకంవారునాగ కన్యకలు ..పతిదానమిమ్మనంగ  పణ తులగనిరి  ఆక్రూరు డానంద ముఖవర్షమునను.. రథంమీద గనిరి రామ కృష్ణుల  మరి యావుల విధములు  మందిరాగిరులు .. కుబ్జకువరదుడై న   గోపాలకృష్ణా .. మల్లులకంసుల  చంపంగ గనిరి ..  చకితులుఖండించినసంతోషమునను సుదతి చేతులగనిరి సుందర రూపము    కావుమీమాధవుడ  కావుమీశరణునాతిపలుకులువినుచు కల కలానవుచు  మగువ పలుకులు వినుచు మాధవుడునవుచు .. మామ కంసును జంపిమరలివచ్చెను  పురము డాయగవచ్చే పురుషోత్తముడు ..  కఠిన ఏనుగు జూచి కదలించి  పలికే   ఏనుగు తోటెంత ఏలాట మాడి........  సింహమైచీరి వేసిన .. తావుగనిరి చాణుర మల్లూర ముష్టి కాచరులా......  ముష్టి కాచరసంహార   ముర వైరిగనిరి  కంస సంహార గనిరి కరుణా కరుడు మామ కంసునిజంపిమధురచేకొన్న  ఉగ్ర సేనునిపట్నం ఒప్పుగాగట్టి....  తల్లి కడ కేతేంచే   త్రై లోక్యనాథుడు  మ్రోక్కుతూకౌగలించినముద్దుగనిరి .. మధురలోపలి వారు   మగువ లందారు.. హారతులివ్వంగానే  అతివలగనిరి   రుక్మిణికళ్యాణ మ్మురూడీ తోగనిరి  రుక్మాంగ దుడు .. తలవంచిన రథముగనిరి  శిశు పాల  దంత వక్త్ర   జరాసంధులగనిరి ..  శూన్యమైఉన్నదే దుర్యోధనులసేన ప్రభ వెలిగి యున్నదే పాండవులసేన  పన్నంగ సేనలో   భారత పురుషుడు .... ఎవ్వరు గన లేదే అర్జునుడు గనెను   ఉత్త మఛి త్తుడగు చున్నఅర్జునదేవరా ....  ఉభయసేనలుగనెను  ఉత్తముడుదేవ   పైడికిదామేర్లు  పుష్పములుబెట్టి ..........పాదములుపూజించే   భక్తి మ్రోక్కుచును   పది కోట్లసూర్యుల   ప్రభకంటేవెలుగు అర్జునునిదృష్టికేఅతిసౌఖ్య మాయే   నిర్భందుడైకిరీటినీళ్ళుపేరుచును...... తత్వ మించుక లేక ధైర్యమ్ముచెడెను దైవ వశమ్మున.. తనయుండు తాను .. లక్క మేడల మమ్మురక్షించినారు   నేడురక్షించుడీనీల యోధరుడా .... ద్వారావతి అనియేటిపట్నమ్ములోను  సభలోనగాచితివి   ద్రౌపదిమానమ్ము  బ్రహ్మఇంద్రాదులకు పరమాత్మమీరు   పాలించిమము గావుప్రహ్లాదవరద  ఐలఉద్ధారకఅంబరీషవరద  ఒక్కటైకుడిచితిమి.. వైలోక్యమాడి..  ఓమ గుండాలాది  ఒడ్లన్ని తడిచి  చదరంగమాడితిమి   సరస మాడితిమి  .. పాచిక లాడితిమిబావని తలచి   బొంకితి మీతోటి  బొంగరాలాడితి ..సరి గద్దె లేక్కితిమి  స్వామీ మీతోటి   సేవించి మీతోటి చెలిమి చేసితిమి.. శ్రీలక్ష్మి పతి  శరణు   సుమీఅయ్య  తల్లివీనీవే   మాతండ్రివీ నీవే   దాతవునీవేమాదైవమునీవే   గురు మంత్రమునీవే  గురువువు నీవే ........గుణమునేవే మాకు గోపాల కృష్ణ   వెనక జన్మమునాటి  వెయ్యితపస్సులను .... ఏమి చేస్తిమో  ? కాని ఎరిగితిమిమిమ్ము  కమలశాంభవ నిన్నుగాన లేనైతి ...... కరుణా కర నేడుకంటినోనిన్ను  దిక్కుఎరుగక నేనుదీనుడానైతిని   దిక్కు నీవే మాకు గోపాలకృష్ణా   అని యిట్లు అర్జునుడుపలుకంగావినుచు ..  అభయహస్తముజాపెఅంబుజోదరుడు  ఆభయమేఆర్జున ఆభయమేఫల్గుణ ...... ఆభయమే   దేవేంద్ర  దేవతనయుడ దివ్యదృష్టి సృష్టి   శీఘ్రానఇస్తి  .. శరణు  శరణుశ్రీ కృష్ణ శరణు సుమీఅయ్య  శంఖ  చక్రాధర  శరణుసుమీఅయ్య ..  హంస నారాయణ  అన్ని హృదయములు   అచ్యుతాశరణు అనిఅంకిల్లుముడిచే   నిజ రూపముచేసుకొనిరి నీలవర్ణులు..రథంమీదగనిరిరామ కృష్ణుల  రథంమీద మమ్మురక్షించినారు .. నేడురక్షించుడీ నీలయోధరుడా   చక్రంపట్టుడీసర్వేశ్వరుడా ...... సారంగ గదా ధరులు   సర్వేశ్వరులు   అర్జునునితోటి సల్లాపాలుఆడుచును ..  కుండలమ్ములుకూచె  గోపాల కృష్ణా  గండస్తలముల కాంతి.. కళకళామెరయ ..మేఘ వర్ణముబోలు  మెయి  తళుకు మెరుపు    పైనున్నపచ్చని ఆటము జారంగ ..బాగుగాగప్పోయి..బావ  శ్రీకృష్ణ   ధరణిపతి పలుకులకు తన లిననవుచు ..ధనము గంటిని చాల  ధన్యుడా నైతి  చంద్రదర్శనమాయే   చంద్రబలములకు  తారదర్శన మాయేతారబలములకు   కుల దీపకుడవు  కుంతీ పుత్రుడవు .. హస్తినాపురరాజ్య మంతాను ఏలు  ద్రౌపది తోడుగాధర్ములుమీరు ..  తమ్ములుమీరంత ధరనంత ఏలు   అమరులకుసురలకుఅతి వాద మగుచు ..అదినిమిత్తానఅవతార మెత్తి..  మత్యమై  జల రాశిచొచ్చి సోమకుని తెచ్చివేదంబ్రహ్మ కిచ్చిన వాడ  కూర్మ మైఅమ్భుదికి కుదురైనిలిచి .... సురలకుఅమృతమ్ము పెట్టిన వాడ   కలికావతారానఖలుని శిక్షించి ........ గుర్రపుడేక్కలలోఒలలాడితిని   వేరవకుమీ ఓడకుమీ.. వెరసి పారకుమీ .. రావయ్య  అర్జునా రథంమీదికని .. రణ భేరి వేయించిరి రామ కృష్ణులు  కౌరవసేనలే గడ గడావణక .. కౌరవుల.. కాళరాత్రుళ్ళు మెరయ  దివ్యగగనములే దిమ్మనుచు మ్రోగ ..పరమాత్ముడుబట్టినపాంచ జన్యమ్ము  పసులకు   బ్రహ్మలకు  బ్రహ్మచేకలవు .. అర్జునుడుపట్టినదేవదత్తమ్ము  మూడు లోకమ్ముల వీనులైపారు ..  వీభూతిదేహమ్మువిశ్వ.. రూపమ్ము ..పీతాంబరముధరియించెసర్వేశ్వరుడు   వీభూతిదేహమ్ము  విశ్వ రూపమ్ము  లక్ష్మినిధరియించె నారాయణుడు  వీభూతిదేహమ్ము విశ్వ రూపమ్ము ..విన్నవారంతానుఆనంద పరులైరి మరి  ఎందు పుట్టరెమర్త్యమ్మునందు .. అన్య కారుల కెల్లనరకమ్ములేదు  శ్రీగోదావరిఅనియేటి నదీతీరాన ..  కోటి వే వేలగంగ్యావులదెచ్చి..  వెండికొమ్ములకుపైడిగురిజలనుగుచ్చి .. సంపూర్ణదక్షిణలుచాలంగాఇచ్చి .. వేదవేదోత్తములయిన బ్రాహ్మణులకు ..అనుదినముగోదానముఇచ్చినఫలము  యజ్ఞము కంటెనుఎక్కువఫలము ..సహస్రనామములకంటే సరివెలుగుచుండు ..  కృష్ణజై కృష్ణజై క్రిష్ణమ్మ జేతు నాథుడ జేతు నన్నేలినాస్వ్వామి