బాలకాండః తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్, నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ర్మునిపుంగవమ్. 1 తపస్సంపన్నుడగు వాల్మీకి, తపోవేదాధ్యయనములందు మిక్కిలి ఆసక్తికలవాడును, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడును, మునులలో ఉత్తముడును అగు నారదుని ఈవిధముగా ప్రశ్నించెను. కో న్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృడవ్రతః. 2 ఈ భూలోకమున మంచి గుణములు కలవాడు, పరాక్రమశాలి, ధర్మమెఱిగినవాడు, తన కితరులు చేసిన మేలు మఱువక తెలిసియుండువాడు, నిజము పలుకువాడు, ఫలించువఱకు పనికొనసాగించు పట్టుదల కలవాడును ఎవడు? చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః, విద్వాన్ కః క స్సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః 3 తన కులధర్మము వీడని వాడెవడు? అన్ని ప్రాణులకు మేలు చేయువాడెవడు? అన్ని విషయముల నెఱిగి, నిపుణుడైన వాడెవడు? ఎల్లప్పుడు జనుల నానందింపజేయు దర్శనము కలవా డెవడు? ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 4 ధైర్యము కలవాడును, కోపమును జయించినవాడును, తేజస్వి యైనవాడును ఎవడు? ఇతరులలో తప్పులు వెదుకు స్వభావము (అసూయ) లేనివా డెవడు? యుద్ధమున కోపించిన ఏ మహాపురుషునకు దేవతలు కూడ భయపడుదురు? ఏత దిచ్ఛా మ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే, మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతు మేవంవిధం నరమ్. 5 నే నీ గుణములు కలవా డెవ్వడో తెలియగోరుచున్నాను. నా కీ విషయమున నెంతో యభిలాష కలుగుచున్నది. ఓ నారదమహర్షీ! ఇట్టి మనుజు డెవడో తెలిసికొనుటకు నీవే సమర్థుడవు. శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకే ర్నారదో వచః, శ్రూయతా మితి చామంత్య్ర ప్రహృష్టో వాక్య మబ్రవీత్. 6 ముల్లోకములందలి విషయములు అన్నియు ఎఱిగిన నారదుడు వాల్మీకి మాట నాలకించి, ఇదుగో వినుమని యాతని తన కభిముఖునిగ చేసికొని ఆనందముతో నిట్లు పలికెను. బహవో దుర్నభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యా మ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః 7 ఓ మునీ! నీవు వర్ణించిన అనేకగుణము లందఱిలో కనిపింపవు. అట్టి గుణములు కలవానిని నే నెఱుగుదును. ఆ నరు డెవ్వడో వినుము. ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః, నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. 8 అత డిక్ష్వాకువంశమున పుట్టినాడు. రాముడని జనులలో ప్రసిద్ధి పొంది యున్నాడు. అతని మనస్సు నిలుకడ కలది. పరాక్రమము గొప్పది. అతడు తేజశ్శాలి, ధైర్యవంతుడు, ఇంద్రియనిగ్రహము కలవాడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః, విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. 9 ఆ రాముడు మిక్కిలి బుద్ధిమంతుడు, నీతి నెఱిగినవాడు, చక్కగా మాటలాడు నేర్పు కలవాడు. ఐశ్వర్యసంపన్నుడు, శత్రువులను నాశనము చేయువాడు, విశాలమైన మూపు కలవాడు, గొప్ప భుజములు కలవాడు, శంఖమువంటి మెడ కలవాడు, గొప్ప కపోలముల పైభాగము కలవాడు. మహారస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః, ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః. 10 విశాలమైన వక్షఃస్థలము కలవాడు, గొప్ప విల్లు కలవాడు, బలిష్ఠుడగుటచే కనపడని జత్రువులు (మూపు సంధి యెముకలు) కలవాడు, శత్రువుల నణచు వాడు, మోకాళ్ళవఱకు విస్తరించిన భుజములు కలవాడు, చక్కని తల, నుదురు కలవాడు, గొప్ప పరాక్రమము కలవాడు. సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్, పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. 11 సకలజీవులందు సమభావన కలవాడు, సమముగ నున్న అవయవములు కలవాడు, నిగనిగలాడు శరీరవర్ణము కలవాడు, పరాక్రమవంతుడు, బలిసిన ఱొమ్ము కలవాడు, విశాలములైన కన్నులు కలవాడు, శోభాసమన్వితుడు, ఉత్తమలక్షణములు కలవాడు. ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః, యశస్వీ జ్ఞానసంపన్నః శుచి ర్వశ్యః సమాధిమాన్. 12 రాముడు ధర్మ మెఱిగినవాడు, సత్యప్రతిజ్ఞ కలవాడు, ప్రజలకు మేలు కలిగించుటలో నాసక్తుడు, కీర్తిమంతుడు, జ్ఞానము కలవాడు, పరిశుద్ధుడు, భక్తవశుడు, ఆశ్రితపరిపాలన మను నియమము కలవాడు. ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః, రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా. 13 ఆ రాముడు బ్రహ్మతో సమానుడు. ఐశ్వర్యసంపన్నుడు, ప్రజా పోషకుడు, శత్రుసంహార మొనర్చువాడు, సకలప్రాణులను రక్షించువాడు, ధర్మమును కాపాడువాడు. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా, వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. 14 అతడు తన ధర్మమును, తనవారిని చక్కగా కాపాడువాడు, వేద వేదాంగముల స్వరూప మెఱిగినవాడు, ధనుర్వేదమున (విలువిద్యలో) కుశలుడు. సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్, సర్వలోకప్రియః సాధు రదీనాత్మా విచక్షణః. 15 సకలశాస్త్రముల పరమార్థమెఱిగినవాడు, తెలిసిన ఆ పరమార్థమును విస్మరింపనివాడు, ప్రతిభ కలవాడు, అందఱకు ప్రీతిపాత్రుడు. మంచి పనుల నాచరించువాడు, దైన్యము నొందనివాడు, అన్ని పనులలో కుశలుడు. సర్వదాభిగత స్సద్భి స్సముద్ర ఇవ సింధుభిః, ఆర్యః సర్వసమశ్చైవ సదైకప్రియదర్శనః. 16 నదులచే సముద్రమువలె ఎల్లప్పుడు సజ్జనులచే సేవింపబడువాడు, పూజ్యుడు, ఎల్లరియందు (శత్రు, మిత్ర, ఉదాసీనులయందు) సమబుద్ధి కలవాడు, ఎల్లప్పుడు అనురాగయుక్తమగు దర్శనమే కలవాడు. స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః, సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవా నివా. 17 అత డన్ని సుగుణముల కాలవాలము. కౌసల్య ఆనందమును పెంపొందించువాడు, లోతైన యాలోచనలో సముద్రు నంతటివాడు, ధైర్యమున హిమవంతునివలె చలింపనివాడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః, కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీసమః, ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః. ఆ రాముడు పరాక్రమమున విష్ణువుతో సమానుడు, చంద్రునివలె ఆహ్లాదము కలిగించు దర్శనము కలవాడు, కోపమున ప్రళయాగ్నితో సమానుడు. సహనమున భూమితో సమానుడు. దానమున కుబేరునితో సమానుడు. సత్యము పలుకుటలో అపరధర్మదేవతయే. యక్షప్రశ్నాః ప్రశ్నః : కింస్వత్ గురుతరం భూమేః కింస్వి దుచ్చతరం చ ఖాత్, కింస్విత్ శీఘ్రతరం వాయోః కింస్విద్ బహుతరం తృణాత్. 1 భూమికంటె బరువేది? ఆకాశము కన్న నున్నతమేది? గాలికన్న వేగము కలదేది? గడ్డికన్నను ఎక్కువగ కనబడునది ఏది? ఉత్తరమ్: మాతా గురుతరా భూమేః ఖాత్ పితోచ్చతర స్తథా, మనః శీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్. 2 తల్లి భూమికంటె బరువైనది (గొప్పది). తండ్రి యాకాశమున కంటె నున్నతుడు. మనసు గాలికంటె వేగము కలది. చింత గడ్డికంటెను ఎక్కువగ అంతటను కనబడునది (చింత అనగా మానసికక్లేశము.) ప్రశ్నః : కింస్విత్ ప్రవసతో మిత్రం కింస్విత్ మిత్రం గృహే సతః, ఆతురస్య చ కిం మిత్రం కింస్విత్ మిత్రం మరిష్యతః. 3 దూరదేశమున నున్నవానికి మిత్రు డెవరు? ఇంటిలో నున్నవానికి మిత్రు డెవరు? రోగికి మిత్రు డెవరు? చావనున్న వానికి మిత్రు డెవరు? ఉత్తరమ్: సార్థః ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః, ఆతురస్య భిషక్ మిత్రం దానం మిత్రం మరిష్యతః. 4 దూరదేశమం దున్నవానికి అట్లు దూరదేశమందున్నవారి (ప్రవాసులు) గుంపు మిత్రుడగును. గృహస్థునకు భార్యయే మిత్రము. రోగికి వైద్యుడే మిత్రుడు. చావనున్నవానికి దానమే మిత్రుడు. ప్రశ్నః : కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ కః శమశ్చ ప్రకీర్తితః, దయా చ కా పరా ప్రోక్తా కిం చార్జవ ముదాహృతమ్. 5 రాజా! జ్ఞాన మనగా నేమి? .శమ మనగా నేమి? దయ యనగా నేమి? ఆర్జవ మనగా నేమి? ఉత్తరమ్: జ్ఞానం తత్త్వార్థసంబోధః శమశ్చిత్తప్రశాంతతా, దయా సర్వసుఖైషిత్వ మార్జవం సమచిత్తతా. 6 పరమార్థము నెరుగుటయే జ్ఞానము. చిత్తము ప్రశాంతముగా ఉండుటయే శమము. సకలజీవులకు సుఖము కలుగవలె నని కోరుటే దయ. అందరియెడల (లేదా సర్వకాలములలో) ఒక్కతీరుగనే ప్రవర్తించు చిత్తము కలిగియుండుట ఆర్జవము. తర్కోఽప్రతిష్ఠః శ్రుతయో విభిన్నా  నైకో మునిర్యస్య మతం ప్రమాణం।  ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం  మహాజనో యేన గతఃస పంథా ॥ 119  అస్మిన్ మహ మోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రిదివేంధనేన।  మాసర్తుదర్వీపరిఘట్టనేన  భూతాని కాలః పచతీతి వార్తా ॥ 120  ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః।  తస్మాద్ధర్మం న త్యజామి మా నో ధర్మో హతోఽవధీత్ ॥ 131  విదురనీతిః బుద్ధ్యా భయం ప్రణుదతి తపసా విందతే మహః, గురుశుశ్రూషయా జ్ఞానం శాంతిం యోగేన విందతి. 1 వివేకముచే భయము పోగొట్టుకొనును. తపస్సుచే తేజస్సు నందును. గురు సేవచే జ్ఞానము సంపాదించును. మనోనిగ్రహముచే శాంతి నందును. ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాంతి రుత్తమా విద్యైకా పరమా తృప్తి రహింసైకా సుఖావహా. 2 ధర్మమొక్కటే ఉత్తమశ్రేయము. ఓర్పు ఒక్కటే ఉత్తమశాంతి. విద్య యొక్కటే గొప్ప తృప్తి. అహింస యొక్కటే సుఖప్రదము. షడేవ తు గుణాః పుంసా న హాతవ్యాః కదాచన, సత్యం దాన మనాలస్య మనసూయా క్షమా ధృతిః. 3 మనుజు డెన్నటికి విడువరాని గుణము లాఱు. అవి సత్యము, దానము, సోమరితనము లేకుండుట, అసూయ లేకుండుట, ఓర్పు, ధైర్యమును. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః, చత్వారి సంప్రవర్ధంతే విద్యా చాయు ర్యశో బలమ్. 4 పూజ్యులను నమస్కరించు స్వభావము కలిగి, పెద్దల నెల్లపుడు సేవించు వానికి విద్య, ఆయువు, యశస్సు, బలము ఈ నాలుగు వృద్ధినందును. త్రివిధం నరక స్యేదం ద్వారం నాశన మాత్మనః, కామః క్రోధ స్తథా లోభః తస్మా దేతత్త్రయం త్యజేత్. 5 కామము, క్రోధము, లోభము అను నీ మూడు ఆత్మవినాశనము కలిగించు మూడువిధములైన నరకద్వారములు. కాన వీనిని విడువవలెను. యథా మధు సమాదత్తే రక్షన్ పుష్పాణి షట్పదః, తద్వదర్థాన్ మనుష్యేభ్య ఆదద్యా దవిహింసయా. 6 పూలు కందకుండ తుమ్మెద తేనె త్రాగునట్లు, (రాజు) మనుజులను వేధించకయే వారి నుండి ధనము (పన్నులను) తీసికొనవలెను. యస్య కృత్యం న జానన్తి మంత్రం వా మంత్రితం పరే, కృత మే వాస్య జానన్తి స వై పణ్డిత ఉచ్యతే. 7 అతడేమి చేయునో యెవ్వరు నెరుగరు. చేసిన ఊహ యేమో తెలియరాదు. ముగిసిన పనిని మాత్రమే ఇతరులు ఎరుగుదురు. అట్టివానినే పండితుడందురు. కఠోపనిషత్ నైషా తర్కేణ మతిరాసనేయా ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాం త్వమాపః సత్య ధృతిర్బతాసి త్వాదృఙ్ నో భూయాన్నచికేతః ప్రష్టా 1-2-9 ఆత్మజ్ఞానము కేవలం తర్కము వలన లభించదు. మంచి గురువు యొక్క ఉపదేశము వల్లనే లభించును. నచికేతా! నీవు గొప్పధైర్యము గలవాడవు. సత్యాన్వేషకుడవు. నీలాంటి శిష్యుడే వండవలెనని నేను కోరుకొంటున్నాను. ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరమ్ ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యధిచ్ఛతి తస్య తత్ 1-2-16 అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నహితో గుహాయామ్ తమక్రతుః పశ్యతి వీత శోకో ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః 1-2-20 ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్త్ కవయో వదంతి 1-3-14 ఏకో వశీ సర్వభూతాంతరాత్మా ఏకంరూపం బహూధా యః కరోతి తమాత్మస్థం యేఽనుపశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్ 2-2-12 నిత్యోఽనిత్యానాం చేతనశ్చేతనానాం, ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం యేఽనుపశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్ 2-2-13 శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్తౌ సమ్పరీత్య వివినక్తి ధీరః । శ్రేయో హి ధీరోఽభిప్రేయసో వృణీతే ప్రేయో మన్దో యోగక్షేమాద్ వృణీతే ॥ 2-2 ॥ ప్రశ్నోపనిషత్ ప్రజాకామో వై ప్రజాపతిః, స తపోఽతప్యత స తపస్తప్త్వా, స మిధునముత్పాదయతే రయించ ప్రాణం చేతి ఏతౌ మే బహుధా ప్రజాః కరిష్యత ఇతి 1-4 కపిల గీతమహాభాగవతం - తృతీయ స్కందం – 26 అధ్యాయం పంచభిః పంచభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః 11 మహాభూతాని పంచైవ భూరాపోఽగ్నిర్మరున్నభః తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతాని మే 12 ఇంద్రియాణి దశ శ్రోతం త్వగృగ్రసననాసికాః వాక్కరౌ చరణౌ మేఢ్రం పాయుర్దశమ ఉచ్యతే 13 మనోబుద్ధిరహంకారశ్చిత్తమిత్యంతరాత్మకమ్ చతుర్ధా లక్ష్యతేభేదో వృత్త్యా లక్షణ రూపయా 14 ఏతావానేవ సంఖ్యాతో బ్రహ్మణస్సగుణస్య హ సన్నివేశో మయా ప్రోక్తో యః కాలః పంచవింశకః 15 తైత్తిరీయోపనిషత్ రసోవై బ్రహ్మ -- ఇందులోదేనా? ఛాంధోగ్యోపనిషత్ జాబాలుని గోత్రం - కథ. భృగువల్లి 3.1.1. యతోవా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి, యత్ ప్రయంతి అభిసంవిశంతి, తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మేతి బృహదారణ్యకోపనిషత్ బ్రహ్మ తమ్ పరాదాద్యోఽన్యత్రాత్మనో బ్రహ్మ వేద క్షత్రమ్ తమ్ పరాదాద్యోఽన్యత్రాత్మనో క్షత్రమ్ వేద లోకాః తమ్ పరాదాద్యోఽన్యత్రాత్మనో లోకాన్ వేద దేవాః తమ్ పరాదాద్యఽన్యత్రాత్మనో దేవాన్ వేద భూతాని వేద సర్వమ్ తమ్ పరాదాద్యఽన్యత్రాత్మనః సర్వమ్ బ్రహ్మ వేద ఇదమ్ బ్రహ్మ ఇదమ్ క్షత్రమ్ ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని ఇదగ్ మ్ సర్వమ్ యదయమాత్మా సర్వే జనాః సుఖినోసంతు, సర్వే సంతు నిరామయాః , సర్వే భద్రాణీపశ్యంతు , మా కశ్చిత్ ధుః ఖ మాప్నుయాత్ కలి విడంబన సూత్రం - నీలకంఠ దీక్షితః వైద్య రాజ నమస్తుభ్యం, యమరాజ సహోదర యమస్తు హరతి ప్రాణాన్ వైద్యః హరతి ప్రాణాన్ ధనానిచ ఆర్యధర్మ శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నాన మాచరేత్ లక్షం విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వాహరిం భజేత్ హితోపదేశం శాస్త్రాణ్యధీత్యాపి భవన్తి మూర్ఖాః, యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్ సుసంచితమ్ ఔషధమాతురాణామ్, న నామ మాత్రేణ కరోతి శన్తమ్ 1-171 న సాహస మనారుహ్య, నరో భద్రాణి పశ్యతి సాహసం పునరారుహ్య, యది జీవతి పశ్యతి 7 దోషభీతే రనారంభః, తత్కాపురుష లక్షణం కిమజీర్ణభయా ద్భ్రాతః, భోజనం పరిహీయతే వనేఽపి దోషాః ప్రభవంతి రాగిణాం, గృహేఽపి పంచేంద్రియ నిగ్రహ స్తపః ఆకుత్సితే కర్మణి యః ప్రవర్తతే, నివృత్తరాగస్య గృహం తపోవనమ్ 90 మహా భారతం త్యజేదేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపద స్యార్థే, ఆత్మార్థే పృధివీం త్యజేత్ చరకసంహిత లాఘవం కర్మ సామర్ధ్యం, స్ధైర్యం దుఃఖసహిష్ణుతా దోషక్షయోఽగ్నివృద్ధిశ్చ, వ్యాయామాదుపజాయతే 7-32 వైద్యామృతం సర్వమన్య త్పరిత్యజ్య, శరీరమనుపాలయేత్ తదభావేహి భావానాం, సర్వాభావః శరీరిణామ్ శివమానసపూజా కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజంవా మానసంవాఽపరాధమ్ విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో భర్తృహరి నీ తి శతకం సంపత్సు మహతాం చిత్తం, భవేదుత్పలకోమలమ్ ఆపత్సుచ మహా శైల, శిలాసంఘాతకర్కశమ్ 56 విద్యా వివాదాయ ధనం మదాయ, శక్తిః పరేషాం ఖలు పీడనాయ ఖలస్య సాధో ర్విపరీత మేతత్, జ్ఞానాయ దానాయ చ రక్షణాయ విక్రమార్క చరితం గతే శోకో న కర్తవ్యో, భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేషు కార్యేషు, వర్తంతే హి విచక్షణాః ఉత్తరగీతా ఆహార నిద్రా భయ మైధునాని, సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్ జ్ఞానం హి తేషా మధికో వశేషో, జ్ఞానేన హీనాః పశుభి స్సమానాః మనుస్మృతి నాఽసృష్టః కస్యచిద్బ్రూయాత్, నచాఽన్యాయేన పృచ్ఛతః జానన్నపి చ మేధావీ, జడవల్లోక ఆచరేత్ 2-110 విప్రాణాం జ్ఞానతోజైష్ఠ్యం, క్షత్రియాణాంతు వీర్యతః వైశ్యానాం ధాన్యధనతః, శూద్రాణామేవజన్మతః 2-155 శంకరకృతం ధరాబద్ధ పద్మాసనా చాంఘ్రియష్టిః నియమ్యలయం న్యస్తనాసాగ్రదృష్టిః య ఆస్తే కలౌ యోగినాం చక్రవర్తీ, స బుద్ధః ప్రబుద్ధోఽస్తు మచ్చిత్తవర్తీ మాళవికాగ్నిమిత్రం - కాళిదాసు పురాణమిత్యేవ న సాధు సర్వం, న చాఽపి కావ్యం నవ మిత్యవద్యమ్ సంతః పరీక్ష్యాన్యతరద్ భజంతే, మూఢః పరప్రత్యయనేయబుద్ధిః భగవద్గీత యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్ | మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః || 11 || శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వ న్నాప్నోతి 18-47 సహజం కర్మ కౌంతేయ, సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధామేనాగ్నిరివావృతాః 18-48 బిల్హణీయం నైవ వ్యాకరణజ్ఞ మేతి పితరం న భ్రాతరం తార్కికం దూరాత్సంకుచితేవ గచ్ఛతి పునశ్శంఢాలవచ్ఛాందసాత్ మీమాంసానిపుణం నపుంసక ఇతి జ్ఞాత్వా నిరస్యాదరాత్ కావ్యలంకరణజ్ఞ మేవ కవితాకన్యా వృణీతే స్వయమ్ చాణక్య నీతి లాలయేత్ పంచవర్షాణి, దశవర్షాణి దాసవత్ ప్రాప్తే తు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్ 3-18 వ్రజేద్ ధనార్థీ వాణిజ్యం విద్యార్థీ చ బహుశ్రుతం I ఋతుకాలమపత్యార్థీ మానార్థీ నృపతిం వ్రజేత్ II ధనము కోరువాడు వ్యాపారమును, విద్యను కోరువాడు పండితుని, సంతానము కోరువాడు ఋతుమతియైన భార్యను, కీర్తిప్రతిష్ఠలను కోరువాడు ప్రభువును ఆశ్రయించవలెను. అష్టా వక్ర గీత మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయమేష్యతి 2-10 మహా భాగవతమ్ చతుశ్లోకీ 2.9.33 అహమ్ ఏవాసమ్ ఏవాగ్రే నాన్యద్ యత్ సదసత్ పరమ్ పశ్చాద్ అహమ్ యద్ ఏతచ్చ యోఽవశిస్యేత సోఽస్మ్యహమ్ 2.9.34 ఋతేఽర్థమ్ యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్ విద్యాద్ ఆత్మనో మాయామ్ యథాభాసో యథా తమః 2.9.35 యథా మహాన్తి భూతాని భూతేషూచ్చావచేష్వ అను ప్రవిష్ఠాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వాహమ్ 2.9.36 ఏతావద్వేవ జిజ్ఞాస్యమ్ తత్త్వజిజ్ఞాసునాత్మనహ్ అన్వయవ్యతిరేకాభ్యామ్ యత్ స్యాత్ సర్వత్ర సర్వదా మూలం తెలియనివి అనాయాసేన మరణం, వినా దైత్యేన జీవనమ్ దేహాంతే తవ సాయుజ్యం, దేహి మే పార్వతీ పతే సర్వేచ సుఖినస్సంతు, సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చద్ దుఃఖభాగ్ భవేత్ తమాదిదేవ మజరం కేచిదాహుశ్శివాభిధమ్ కేచి దహిష్ణుం సదా సత్యం బ్రహ్మాణం కేచిదూచిరే క్షణశః కణశశ్చైవ, విద్యా మర్థం చ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా, కణత్యాగే కుతో ధనమ్ అల్పాక్షరం, అసంధిగ్ధం, సారవత్, విశ్వతోముఖం అస్తోభం, అనవద్యం చ సూత్రం సూత్ర విదో విదుః శిశుర్వేత్తి పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణీ కో వేత్తి కవితాతత్త్వం, శవో జానాతి వానవా అతి పరిచయాదవజ్ఞః సంతతగమాదనాదరః భవతి । మలయేభిల్లీ పురంధ్రీ చందన తరూస్ ఇంధనం కురుతే ॥ విశ్శ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. మరి కొన్ని స్థానభ్రష్టా నశోభంతే దంతా కేశా నఖా ద్విజా స్థానభ్రష్టా శ్చశోభంతే దంతా కేశా నఖా ద్విజా హోతః ఋగ్వేదం నుండి స్తోత్రములను పఠించు వాడు. అధ్వర్యుడుః యజుర్వేదానుసారము గా కర్మలను నిర్వహించువాడు. ఉద్గాతః సామవేదమును గానము చేయు వాడు. బ్రహ్మః అధర్వ వేదపండితుడు. పర్య వేక్షకుడు. న సంశయమనారుహ్య నరో భద్రాణి పశ్యతి సంశయమనారుహ్య యది పశ్యతి, స పశ్యతి న సాహసమనారుహ్య నరో భద్రాణి పశ్యతి సాహసమనారుహ్య యది పశ్యతి, స పశ్యతి కన్యా వరయతే రూపం మాతా విత్తం పితాశృతం బాంధవాః కులమిచ్ఛంతి మృష్టాన్నమితరే జనాః ఒకటి అయమాత్మా బ్రహ్మ. రెండు ప్రజ్ఞానం బ్రహ్మ. మూడు తత్వమసి. నాలుగు అహం బ్రహ్మాస్మి. 1. డు, ము, వు, లు, 2. నిన్, నున్, లన్, కూర్చి, గురించి 3. చేతన్, చేన్, తోడన్, తోన్ 4. కొఱకున్, కై 5. వలనన్, కంటెన్, పట్టి 6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ 7. అందున్, నన్ అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యపురుషో నాస్తి ప్రయోగస్తత్ర దుర్లభః ఉపనిషద్వాక్యములు: ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వ భూతాన్తరాత్మా నేహ నానాస్తి కించన (బృహదారణ్యక 4.4.19) మృత్యోః సమృత్యు మాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. (బృహదారణ్యక 4.4.10) ద్వీతీయాద్వై భయం భవతి (బృహదారణ్యక) ఉదరమన్తరం కురుతే అథ తస్య భయం భవతి (తైత్తిరీయోపనిషత్ 2.7.8) స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, స ఏకః (తైత్తిరీయోపనిషత్) సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః (ఈశావాస్య 7) తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః (ఈశావాస్య 7) యస్మిన్నేకస్మిన్విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి (ఛాందోగ్య) ఈశావాస్యమిదం సర్వమ్ (ఈశావాస్య 1) ఐతదాత్మ్యమిదంసర్వమ్ (ఛాందోగ్య 6.8.7) స ఆత్మా, తత్వమసి శ్వేతకేతో (ఛాందోగ్య 6.8.8) సర్వం హ్యేతద్బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ (బృహదారణ్యక 2.5.19) సచ్చత్యచ్చాభవత్ (తైత్తిరీయోపనిషత్ 2.6.1) బహుస్యాం ప్రజాయేయ (తైత్తిరీయోపనిషత్ 2.6.) ఏకం సద్విప్రా బహుధా వదన్తి ( ఋుగ్వేద సంహిత) ప్రజాపతిశ్చరతి గర్భే అన్తః అజాయమానో బహుధా విజాయతే ( ఋుగ్వేద సంహిత) ఓమిత్యేతదక్షరం ఇదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్ భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ మిత్రం స్వచ్ఛతయా రిపుంనయబలైః లుబ్ధం ధనైః ఈశ్వరమ్ కార్యేణ ద్విజమాదరేణ యువతిం ప్రేమ్ణా శమైర్భాందవాన్ అత్యుగ్రం స్తుతిభిః గురుం ప్రణతిభిః మూర్ఖం కథాభిః బుధం విద్యాభీః రసికం రసేన సకలం శీలేన కుర్యాద్వశమ్ నీతిర్భూమిభుజాం నతిర్గుణవతాం హ్రీరంగనానాం రతి ర్దంపత్యోః శిశవోగృహస్య కవితా భుద్ధేః ప్రసాదో గిరామ్ లావణ్యం వపుషః శ్రుతం సుమనసః శాంతిర్ద్విజస్య క్షమా శక్తస్య ద్రవిణం గృహాశ్రమవతాం స్వాస్థ్యం సతాం మండనమ్ శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం ॐ सहनाववतु । కలసి ఉందుము కాక! May we stay together ! सह नौ भुनक्तु । కలసి నేర్చుకుందుము కాక! May we learn together ! सह वीर्यं करवावहै । కలసి ప్రయత్నించుము కాక! May we work together ! तेजस्वि नावधीतमस्तु । నేర్చుకున్నది మనలను తేజోవంతులను చేయుగాక! May we become excellent at what we learn! मा विद्विषावहै ॥ మన మధ్య విభేదము కలుగకుండుకాక! May never there be a contention between us ! ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ May all beings live in harmony! ॐ असतो मा सद्गमय। From untruth, lead me to truth; तमसो मा ज्योतिर्गमय। From darkness, lead me to light; मृत्योर्माऽमृतं गमय। From death, lead me to immortality; ॐ शान्ति: शान्ति: शान्ति: ॥ May all beings live in harmony! असंतुष्ट द्विजो नष्टः संतुष्ट इव पार्धिवः सलज्जा गणिका नष्टा निर्लज्जैव कुलांगना అనుష్థుప్ ఛంధః పన్చమం లఘు సర్వత్ర సప్తమం ద్విచతుర్థయోః షష్టమ్ గురు విజానీయాత్ ఏతత్ శ్లోకస్య లక్షణం Each Pada has eight syllables. Laghu in fifth position in all four Padas and in the seventh position in the second and fourth Padas Guru in sixth position in all four Padas All the other syllables can be anything. Exodus 20:10 but the seventh day is a Sabbath to the LORD your God; on it you shall not do any work, you, or your son, or your daughter, or your male servant, or your female servant, or your cattle, or the resident foreigner who is in your gates. Matthew 10:34 "Do not think that I have come to bring peace to the earth. I have not come to bring peace but a sword. 10:35 For I have come to set a man against his father, a daughter against her mother, and a daughter-in-law against her mother-in-law, 10:36 and a man's enemies will be the members of his household. 10:37 "Whoever loves father or mother more than me is not worthy of me, and who-ever loves son or daughter more than me is not worthy of me.