శ్రీ కృష్ణ శర్మ గారు వృత్తిరీత్యా   information systems archiect 

గత 24 సంవత్సరాలు గా ఆయన USA లో ఉంటున్నారు.
కాని, ప్రవృత్తి రీత్యా   ఒక social worker గా తనను తాను అభివర్ణించు కోవడానికే ఇష్ట పడతారు.
అటు  USA లోనూ, ఇటు India లోనూ, గత  30 సంవత్సరాలు గా వీలైనంత వరకూ చిన్నా, పెద్దా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూన్నారు.
వివాహసంబంధాలు క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో ఆయన దృష్టి ఈ సమస్య మీదకు మళ్లింది.

వివాహ జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలి? కుటుంబాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి? 
అనే విషయాల పై గత 4  సంవత్సరాలుగా అటు  USA లోనూ, ఇటు India లోనూ,  workshops నిర్వహిస్తున్నారు.
గృహస్థ  instintute of family managment  స్థాపించి, వివాహ విషయాలు, కుటుంబ విషయాలు మీద  awareness పెంచడానికి కృషి చేస్తున్నారు.





మంచి కుటుంబాలు కార్యక్రమం, తొలిసంచిక కు స్వాగతం.


సమాజంలో ఆర్ధికంగానూ, సాంఘికం గానూ అనేకమైన మార్పులు వస్తున్నాయి.
ఫలితంగా, వివాహ వ్యవస్థ అనేక సమస్యల నెదుర్కుంటున్నది.
యువతరం, పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని ఆలోచించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఆ confusion లోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
మూడు సంవత్సరాలు కూడా తిరగకుండానే అనేక వివాహాలు ఇబ్బందులలో పడుతున్నాయి.
హాయిగా enjoy చెయ్యాల్సిన రోజల్లో అనేక జంటలు
 పంతాల తోను, పట్టింపులతోనును, మూర్ఖత్వంతోనూ,అర్థంలేని స్వార్థంతోను, దాంపత్యజీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.

అసలు వివాహ జీవితం అంటే ఏమిటి? అందులో బరువు భాద్యతలు ఎలా ఉంటాయి? ఎలా నిర్వహించాలి 
అనే విషయాలపై కనీస అవగాహన లేకుండానే పెళ్లి చేసు కోవడం, 
తరువాత వచ్చే సమస్యలను, ఎలా ఎదుర్కోవడం అన్నది తెలియక సతమతమై పోవడం జరుగుతున్ననది.
 
ఈ నేపధ్యంలో వ్యక్తిగతంగా ఏంచేయగలం, ఏంచేయాలి, సమాజపరంగా  ఏంచేయగలం, ఏంచేయాలి ?
ఈ విషయాల్లో ఒక నిర్మాణాత్మకమైన step తీసుకోవడానికి, 
Grihastha  Institute of Family Management 
సౌజన్యంతో E TV ఈ 'మంచి కుటుంబాలు' కార్యక్రమం నిర్వహిస్తుంది.


Family counselling అనేది ఈ రోజుల్లో కొంత ప్రాచుర్యం లోకి వస్తున్నది. 
కాని అది  ముఖ్యంగా    problems వచ్చిన తరువాత ఎంచేయాలి అనే కోణం లోనించి చూడటం అవుతుంది.
Repair కంటే ముందు prepapre గురించి ఆలోచించాలి. 
Preparation సరిగ్గా ఉంటే    repair కు అవసరమే రాదు.

అందుకని ఈకార్యక్రమంలో ఇంకో రెండు అడుగులు ముందుకు వెళ్దాం.
ఇందులో మూడు రకాల వర్గాలకు సంబంధించి న విషయాలు చర్చిద్దాం.

మొదటిది,   పెళ్లి చేసుకోవాలి అనుకుండే వాళ్లకు ఏ ఏ సమస్యలు ఉంటాయి? ఏ ఏ విషయాలు వాళ్లు తెలుసుకోవాలి? సరియైన జీవిత  భాగస్వామిని ఎలా ఎన్నుకోవాలి? 
ఆవిషయంలో వారికి ఏమి సహాయం కావాలి? ప్రస్తుత సమాజం వారికి ఆ సహాయం అందించ కలుగుతున్నదా? ఇలాంటి విషయాలు మనం చర్చించాలి.


రెండోది, మామూలు కుటుంబాల లో ఉండే మామూలు సమస్యలు. 
పిల్లల్ని ఎలా పెంచాలి? వాళ్ల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి? వాళ్లు మానసింకగా సరీగ్గా ఎదగాలంటే ఏంచేయాలి?
కుటుంబం అనేది మూడు తరాలకు వారధి. పిల్లలు ఎదిగేటప్పుడు తాతలతోను, అమ్మమ్మల తోను పెరుగుతూను  నేర్చుకునేవి   చాలా ఉంటాయి. ఆ విషయాల గురించి చర్చించాలి.
ఇక పోతే ఉద్యోగపు వత్తిడులు. professional stress. అది ఎలా  manage చేయాలి?   ఇంక peer pressure ఎలా  manage చేయాలి?  
పిల్లలకు  చెడు అలవాట్లు రాకుండా ఎలా చూసుకోవాలి?
ఏ ఏ విషయాల్లో ఓపిక పట్టాలి?  ఏ విషయాల్లో వెంటనే    actioin తీసుకోవాలి?

ఇక పోతే మూడోది.  అప్పుడప్పుడు, వివాహ జీవితంలో తీవ్రమైన సమస్యలు  వస్తాయి. అవి ఎలావస్తాయి? ఎలా సరిదిద్దుకోవాలి? కోతి పుండు బ్రహ్మరాక్షసి కాకుండా ఎలా చూసుకోవాలి?
పరిస్థితులు చెయి దాటి పోకుండా ఎలా చూసుకోవాలి?

ఇలా అన్నివిషయాలు సమగ్రంగా ఆలోచిద్దాం.

ముందుగా ఈ రోజు, మన ఈ మొదటి సంచిక లో, మనకు మామూలుగా తెలుసు అనుకునే ఒక విషయం గురించి, in-depth తెలుసుకుందాం.

మనకు తెలుగు లో కుంటుంబ విషయానికి సంబంధిచి వినే పదాలు మూడు ముఖ్యమనవి ఉన్నాయి.

అవి, దాంపత్యం, కాపురం, సంసారం అనేవి.
ఈ పదాలు అందరూ వింటుంటారు, వాడుతుంటారు, 
కాని, చాలా తక్కువ మంది మాత్రమే వాటి  deep meaning  ఆలోచిస్తారు.

ఈ మూడు విషయాలు మనకు బాగా  అర్థమైతే    Family Life ఇంకా అర్థవంతంగా మారుతుంది. చాలా చికాకులు చిన్నవి గా , silly గా అనిపిస్తాయి అప్పుడు. వాటంతట అవే సమసి పోతాయి.

ఈ రోజు మనం దాంపత్యం గురించి చర్చించుకుందాం. వచ్చే వారం, కాపురం గురించి, పైవచ్చే వారం, సంసారం గురించి చర్చించు కుందాం.

దాంపత్యం అంటే ఏమిట? దాంపత్యం లో మాధుర్యం ఎలా ఉంటుంది? 
దాంపత్యం లో అపశృతులు రాకుండా ఎలా చూసుకోవాలి? వస్తే ఏమి చేయాలి?

దాంపత్యం మామూలుగా అనుకొనే ప్రేమకాదు. స్నేహం కాదు. అసలు అది ఇద్దరు మనుష్యుల మధ్య ఉండే బంధం కూడా  కాదు.
అది స్త్రీకి, పురుషుడి కి ఉండే బంధం కూడా కాదు. 
అంతకంటే లోపల,  స్త్రీత్వానికి, పుంస్త్వానికి మధ్య, పకృతిలో సహజం గా ఉండే ధర్మం. 
అది స్త్రీ పురుషుల మధ్య ప్రకటితం అవుతుంది.
స్ర్తీ పురుషలు ఒకరిని ఒకరు చూసుకునేటప్పుడు, వారిలో ఉన్న స్త్రీత్వం, పుంస్త్వం  automatic గా మాట్టాడుకుంటాయి.
అందుకే కవులు వీటిని, 'మనసుకు తెలియని భావాలు',  'అర్థంగాని అనుభవాలు' ఇలా  వర్ణిస్తారు.
ఈ అనుభవాన్ని కొందరు చాల easy గా పొందుతారు. కొందరు ప్రయత్నం చేత పొందుతారు.
 అయితే,  సిగ్గు చేత,  embarassment చేత, అలవాటు లేని కారణంగాను, చాలా మంది ఆ ప్రయత్నం చేయరు.
కొందరు అసలు ఇది కృత్రిమం అన్న భావనలో కూడ ఉంటారు.
ఈ భావనల్లోనించి బయట పడి, ఆ తెలియరాని అనుభవాన్ని, అనుభవం లోకి తెచ్చుకోవాలి. ఆ అనుభవమే దాంపత్యం

ఎలా అంటే, చాలా  simple . రోజుకు ఒక సారన్నా, కనీసం వారానికి ఒక సారన్నా
 భర్త భార్య కేసి, ఒక స్త్రీని చూసినట్లు చూడాలి. భార్య భర్తకేసి, ఒక పురుషుణ్ణి చూసినట్లు చూడాలి.
ఇదేంటి? ఇంత చిన్నవిషయం ప్రత్యేకించి చెప్పుకోవాలా అనిపిస్తుంది. కాని, ఈ విషయం miss అవడం వల్లనే  అన్ని  problems వస్తాయి.

భార్యా భర్తలు,ఒకరి నొకరు room mates లాగా  చూసుకోవడం వేరు. friends లాగా చూసుకోవడం వేరు. 
అది సహజీవనానికి ఉపయోగ పడుతుంది. కాని కుటుంబానికి, జీవితాంతం ఉండే బంధానికి పునాది కాదు.


అయితే ఏ పురుషుడు, ఏ స్త్రీని చూసినా పుంస్త్వం స్త్రీత్వాన్ని చూచినట్లు కాదా అని అడగ వచ్చు.
కాదు. ఒక పురుషుడు, ఒక  స్ర్రీని చూసినప్పుడు, 'అవును, నేను నీదాననే' అన్న ప్రతిస్పందన స్పష్టంగా కనపడాలి.
అలానే, స్త్రీ పురుషుణ్ణి చూసినప్పుడు, 'అవును, నేను నీ వాడనే' అన్న  ప్రతిస్పందన స్పష్టంగా కనపడాలి.
అదే వివాహబంధం. రెండు వైపుల నుండి ఆ భావన ఉన్నదన్న నమ్మకం కలగడమే, వివాహానికి పునాది.


అందులో   doubt ఉంటే, పది సంవత్సరాలు కలిసి ఉన్నా అది వివాహం కాదు. వివాహం పేరుతో   live in relationship మాత్రమే అవుతుంది.
దానికి పనాదులు లేవు. అది గాలికి ఊగుతుంది. వర్షానికి పడి పోతుంది. 
కొందరు మేము friends గా విడిపోయాం అంటారు. అవును, friends గా మాత్రమే ఉన్నారు కనుక.
దంపతులు గా మార లేదు కనుక.

వివాహం strong గా ఉండాలంటే భార్యా భర్తలు, ఒకరినొకరు 'ఆ' విధంగా రోజుకొకసారి, లేదా వారానికి ఒక సారి చూచుకోవాలి, లేదా తాకాలి. లేదా   I Love you లాంటి చిన్నమాట అనాలి.
అనాలి కనుక అంటే పనిచేయదు,మనసు లో ఆ భావనను నింపుకోని, ఇది ప్రకృతి సహజం అన్న నమ్మకంతో,  enjoy చేస్తూ అనాలి.
మెల్లిగా అది జీవితంలో భాగమై, వివాహజీవితానికి పునాది అవుతుంది.

ఈ భావం నిష్కల్మషంగా చూపించుకోవాలి.
నిన్నపప్పుసరిగ్గాలేదు. పండక్కిమీరు చీర తేలేదు. మీవాళ్లు సరిగ్గా మాట్లాడలేదు. పిల్లల సంగతి ఏమి ఆలోచించారు?
ఎప్పుడూ  work busy నేనా  ?  ఎప్పుడూ పక్కింటి వాళ్లతో కబుర్లేనా? 
ఇలాంటి సవాలక్ష ఆలోచనల్ని పక్కకు పెట్టి, నిష్కల్మషంగా ఈ దాంపత్య భావాన్ని ప్రకటించుకోవాలి.

ఈ భావం కనుక  strong   గా లేక పోతే అనేక అపశృతులు వస్తాయి.
ఒకరి మీద ఒకరికి,  నన్ను  ignore చేస్తున్నారా, నన్ను use చేసుకుంటున్నారా అనే సందేహాలు చేసుకుంటాయి.
నాకు కావాల్సిన విధంగా నువ్వు ఎలా చేయవో చూస్తాను లాంటి అపస్వరాలు మొదలవుతాయి.
committment ఉంటే అన్నీ సర్దుకు పోతాయి అని అనుకుంటారు.
కాని కొందరు  committment పేరుతో వారికి కావాల్సిన విధంగా వారు చేసుకు పోతూ, పక్కవాళ్లు వాళ్లని గుర్తించడం లేదు అని బాధ పడి పోతుంటారు.
అవి ఏవీ దాంపత్యానికి పునాది కాలేవు. 

దాంపత్యం అనే బంధం ప్రదర్శంచుకోవడానికి అనేక మార్గాలున్నాయి. 
భర్త ఇంటికి వస్తూ పూలు తెచ్చి ఇచ్చినప్పుడు కలిసే చూపులో ఉండవచ్చు.
భార్య తములపాకులు తెచ్చి ఇచ్చినప్పుడు కలిసే చూపులో ఉండవచ్చు.

అందుకే అవి  romantic చిహ్నాలుగా ఉండి పోయాయి.

Romance is the spice of marriage  అంటారు. కాని, నిజానికి,  Romance is the basis for marriage.
ఇది  miss చేస్తూ,  problem ఎక్కడ ఉందా అని ఆలోచిస్తారు.

దాంపత్యానికి పేదరికం లేదు. 

ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్న కుటుంబాలైనా సరే, అందు వల్లనే దాంపత్యం సరీగ్గా ఉంటే చాలు, successful సాగుతాయి.

దాంపత్యం విషయం అవగాహన లేకపోతే, మిగిలిన problems అన్నీ పైకి తేలి వివాహాన్ని కుదిపి వేస్తాయి.
అప్పుడు వివాహం కోర్కెలు తీర్చుకోవడానికి, గొంతెమ్మ కోర్కెలు తీర్చుకోవడానికి, 
భర్తను లొంగదీసుకోవడానికి, భార్యను బానిస లాగా మార్చడానికి, మార్గమౌతుంది.
భర్తను సాధించడానికి, భార్యను వేధించడానికి  కూడా మార్గమౌతుంది.
అప్పుడు బయటి వాళ్ల  interference, influence కూడా పెరిగి పోతుంది.

ఆలాంటి సమయాల్లో పిల్లల్ని అడ్డం పెట్టుకోని, తల్లిదండ్రుల్ని తోడుతెచ్చుకోని, భార్యా భర్తలు ఒకరినొకరిని పీడించుకొనే పరిస్థతి వస్తుంది.

అలా కాకుండా దాంపత్యం పటిష్ఠంగా ఉంటే, భార్యభర్తల మధ్య ఉండాల్సిన మిగిలిన మంచి భావాలన్నీ వాటంతట అవే వస్తాయి.
నా సంతోషంకాదు, నిన్ను సంతోషపెట్టడం నాధర్మం అనే భావన ఇద్దరి లోను అప్పుడే వస్తుంది.

కష్టాలు వస్తే, నీవల్లనే వచ్చాయి అంటే నీవల్లనే వచ్చాయి, అనే భావన కాకుండా, కష్టాలు ఇద్దరికీ వచ్చాయి, కాలం వల్ల వచ్చాయి అన్నవివేకం ఉంటుంది.
రామాయణం సారాంశంకూడా ఇదే.